సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన ఎమ్మెల్యే

RR: హయత్‌నగర్‌లోని షిర్డీ నగర్‌కు చెందిన రాఘవేంద్రకు రూ.2 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మంగళవారం అందించారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రాఘవేంద్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఎమ్మెల్యేను ఆశ్రయించడంతో చెక్కు మంజూరైంది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరం లాంటిదన్నారు.