భక్తి మార్గంలో పయనించాలి: MLA బొజ్జు పటేల్
ADB: ప్రజలందరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయకుంట గ్రామంలో నిర్వహించిన కాలు బాబా ఆలయంలో కలశ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించటం పట్ల MLA హర్షం వ్యక్తం చేశారు.