రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
ELR: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి గురువారం మృతి చెందాడు. నూజివీడు-వట్లూరు రైల్వేస్టేషన్ మధ్య బొమ్మలూరు రైల్వే గేట్ దాటుతున్న సమయంలో రైలు గుర్తుతెలియని వ్యక్తిని ఢీకొంది. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, చామన చాయ రంగు కలిగి బిస్కెట్ కలర్ చొక్కా ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసినవారు ఏలూరు రైల్వే ఎస్సై దానం 9440411000 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.