ప్రధాని పర్యటనలో ప్రజల కోసం బస్సు సౌకర్యాలు

కృష్ణ: నూజివీడు మండలం మర్రిబంధంలో రేపు ఉదయం 9 గంటలకు బస్సులను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభిస్తారని ఎంపీడీవో రాఘవేంద్రనాథ్ తెలిపారు. నూజివీడులో ఎంపీడీవో గురువారం మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనకు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో గ్రామానికి ఒక్కొక్క బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.