భారీగా పంట నష్టం

GNTR: వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని పెద్ద ఎత్తున వీచిన పెనుగాలులకు తాడేపల్లి పరిధి ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో అరటి, మునగ రైతులు రూ.4కోట్లు నష్టపోయారని రైతు సంఘం రాజధాని డివిజన్ కార్యదర్శి కొర్రపోలు జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం పంటలను ఆయన పరిశీలించారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇందులో ఈశ్వర్ రెడ్డి, బోస్ రెడ్డి, మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.