రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం

రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం

తూ.గో: ఉభయ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన ఏలూరు జిల్లా ఐఎస్.జగన్నాధపురం బయలుదేరి వెళ్లారు.