VIDEO: 'సర్పంచ్, సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలి'
SRCL: తంగళ్ళపల్లి మండలం నర్సింహులపల్లిలో భార్య చెక్కపల్లి శరణ్య సర్పంచ్‌గా గెలిచినప్పటికీ భర్త లింగారెడ్డి పెత్తనం చెలాయిస్తున్నాడని గ్రామస్తులు వాపోయారు. సర్పంచ్ శరణ్యను గ్రామ సభలో గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే భర్త లింగారెడ్డి సమాధానం చెబుతున్నాడని వాపోయారు. భార్య సర్పంచ్‌గా గెలిస్తే భర్త ఎలా పెత్తనం చేస్తాడని ప్రశ్నించారు.