విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

NRPT: మక్తల్ పట్టణంలో సోమవారం రాత్రి ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌తో వ్యక్తి దుర్మరణం చెందాడు. పట్టణంలోని బాపునగర్ కాలనీలో ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా ఇంటికి క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బోర్ విద్యుత్ తీగలు తగలడంతో ఇంటి యజమాని మహేష్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు.