మద్యం సేవించి వాహనాలు నడిపిన 14 మందికి జైలు శిక్ష
SRCL: మద్యం సేవించి వాహనాలు నడిపిన 14 మంది మందుబాబులకు జైలు శిక్ష పడగా 57 మందికి జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, 71మంది మందు బాబులు పట్టుబడ్డారు. వేములవాడ పోలీసులు శనివారం రోజున కోర్టులో ప్రవేశపెట్టగా 14 మంది మందు బాబులకు జైలు శిక్ష విధించారు.