సంక్షేమం పేరుతో జగన్ దోపిడీ చేశాడు : మంత్రి స్వామి

సంక్షేమం పేరుతో జగన్ దోపిడీ చేశాడు : మంత్రి స్వామి

ప్రకాశం: చంద్రబాబు ఏం చేసినా ప్రజల శ్రేయస్సుకేనని మంత్రి స్వామి అన్నారు. జగన్ తన హయాంలో ఆటో డ్రైవర్లకు రూ.10వేలు ఇచ్చి జరిమానాల పేరుతో రూ.30,000 లాక్కున్నారని అన్నారు. తాము రూ.15వేలు దసరా రోజు ఆర్థికసహాయం చేయనున్నట్లు చెప్పారు. జగన్ మట్టి ముంత ఇచ్చి రాగి చెంబు లాక్కునే రకమని మంత్రి స్వామి విమర్శించారు. సంక్షేమం పేరుతో జగన్ దోపిడీకి పాల్పడ్డారన్నారు.