పాడి పశువుల పునరుత్పత్తిపై వైద్యుల సూచనలు

పాడి పశువుల పునరుత్పత్తిపై వైద్యుల సూచనలు

KMM: మధిర మండలం ఇల్లూరు, సిరిపురం గ్రామాల్లో శుక్రవారం ఉచిత గాలికుంటు నివారణ టీకా శిబిరం జరిగింది. పశువైద్యాధికారి ఉమా కుమారి మాట్లాడుతూ... పాడి పశువులను 60–90 రోజులలో చూలు కట్టించాలని సూచించారు. రెండో ఎదలో గర్భధారణ అవకాశాలు ఎక్కువని, ఎదకు రాని పశువులకు వైద్యుల సలహా తీసుకోవాలన్నారు. రైతులు గెస్టేషన్ హీట్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.