ప్రణాళిక ప్రకారమే పాఠశాలపై అమెరికా దాడి: ఇరాన్
అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించి నెలరోజులవుతోంది. యుద్ధం మొదటి రోజు మినాబ్‌లోని ఓ పాఠశాలపై జరిగిన దాడి అమెరికా ప్రణాళిక ప్రకారమే చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఐరాస మానవ హక్కుల మండలికి పంపిన వీడియో ప్రసంగంలో ఇరాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ఈ ఘటనలో 160 మందికి పైగా చిన్నారులు, 14 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.