కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
KMR: ఎల్లారెడ్డికి చెందిన రేష్మ తన భర్త నజీమ్ మద్యం సేవించి వేధిస్తున్నాడని డయల్ 100కు సోమవారం రాత్రి కాల్ చేసింది.పెట్రో కార్ కానిస్టేబుల్ సాయికిరణ్ ఘటన స్థలానికి వెళ్లి నజీమ్‌కు నచ్చ చెప్పడానికి యత్నించారు. ఆయన కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించారు. దాడి చేసిన వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు.