‘యువత కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి’

‘యువత కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి’

TG: యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని మంత్రి శ్రీధర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ టీ హబ్‌లో నిర్వహించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడుతూ.. ‘సాహసాలు చేసినప్పుడే విజయం దక్కుతుంది. ఉన్నత స్థానాలను చేరుకోవడమే లక్ష్యంగా కష్టపడాలి. స్టార్టప్స్‌ని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు.