'అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇందిరమ్మ ఇల్లు'

KMM: ఈ నెల చివరిలోగా ప్రెస్ అకాడెమీ భవనం ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలైన జర్నలిస్టులకు అలాగే వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.