ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
KMR: జుక్కల్ మండలంలోని బిజ్జల్వాడి గ్రామంలో ఇందిరమ్మ పథకం ద్వారా, లబ్ధిదారుడు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని, ఇవాళ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించి ,లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న, గృహ నిర్మాణ పథకం ప్రతి కుటుంబానికి స్థిర నివాసం కల్పిస్తుందన్నారు.