ఎమ్మెల్యేకు మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు
CTR: పుంగనూరు మండలంలో కృష్ణం రెడ్డి పల్లిలో వెలిసి ఉన్న శ్రీ నల్లరాళ్ల పల్లి గంగమ్మను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు గ్రామ ప్రజలు, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించిన సీ.సీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమం గ్రామస్తులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.