వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

BHPL: వర్షాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రజలు 9030632608 కంట్రోల్ రూమ్ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ 24/7 పనిచేస్తుందని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.