భాగస్వామ్య సదస్సుపై సమీక్ష
VSP: నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా సదస్సు జరగనుందని తెలిపారు.