పాక్- అఫ్గాన్‌ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత

పాక్- అఫ్గాన్‌ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత

పాక్- అఫ్గాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల ఇరుదేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో నిన్న రాత్రి పాక్-అఫ్గాన్ బలగాల మధ్య భారీ కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు  వెల్లడించాయి. కాగా, ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా చుమన్ సరిహద్దులో అఫ్గాన్ కాల్పులు జరిపిందని పాక్ ఆరోపించింది.