రహదారిపై ఆదమరిచి ప్రయాణిస్తే అంతే

రహదారిపై ఆదమరిచి ప్రయాణిస్తే అంతే

E.G: ఉండ్రాజవరం మండలం, రెడ్డి చెరువు గ్రామంలో ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. వంతెనకు రక్షణగా ఉండే రక్షణ గోడలు లేకపోవడంతో ప్రమాదభరితంగా ఉంది. ఈ రద్దీగా ఉండే ఆర్&బీ రోడ్డుపై వాహనదారులు ఆదమరిచే వెళ్తే ప్రమాదాల్లో పడే అవకాశం ఉంది. దీంతో సంబంధిత అధికారులు స్పందించి వంతెన నిర్మించి సమస్య పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.