VIDEO: ఎమ్మెల్యేను సన్మానించిన మున్సిపల్ కార్మికులు

CTR: మున్సిపల్ శాఖలో పనిచేసే ఔట్ సోర్సింగ్ వర్కర్స్ వేతనాలు ప్రభుత్వం పెంచడాన్ని హర్షిస్తూ.. పలమనేరు మున్సిపల్ కార్మికులు మంగళవారం ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని సన్మానించారు. ఈ మేరకు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన్ను కలిసి శాలువలతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం తమ విధులను మరింత మెరుగ్గా నిర్వహించి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.