అదనపు ఎస్పీగా మౌనికకు పదోన్నతి

అదనపు ఎస్పీగా మౌనికకు పదోన్నతి

ADB: ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న మౌనికకు అదనపు ఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆమె భుజాలపై 'సింహ తలాటం' (స్టార్స్) చిహ్నాన్ని అలంకరించి ప్రత్యేకంగా అభినందించారు. మౌనిక ఇకపై జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు నిర్వహించనున్నారు.