VIDEO: ఇండియన్ ఉమెన్ ఫుట్‌బాల్ లీగ్‌కు DKRFC జట్టు
NZB: ఇండియన్ ఉమెన్ ఫుట్‌బాల్ లీగ్ టోర్నమెంటుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన DKRFC మహిళా జట్టు ఎంపికైంది. డాక్టర్ కవితా రెడ్డి నేతృత్వంలో, కోచ్ నాగరాజ్ శిక్షణలో రాటుదేలిన ఈ జట్టు జాతీయ స్థాయికి ఎంపికవ్వడం గమనార్హం. కేరళలోని త్రిసూర్లో ఈనెల 18 నుంచి 30 వరకు జరిగే ఈ టోర్నీలో జట్టు పాల్గొంటుంది. ఈ సందర్భంగా క్రీడాకారిణులను క్రీడాభిమానులు అభినందించారు.