'తెలంగాణ ఉద్యమకారుల సమావేశాన్ని విజయవంతం చేయాలి'
KNR :హైదరాబాద్‌లో ఈనెల 18న జరిగే తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని, కరీంనగర్ జిల్లా ఫోరం అధ్యక్షుడు ఎక్కేటి సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. జమ్మికుంట మండలం నాగంపేటలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ విజయశాంతి హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు తరలిరావాలన్నారు.