'ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి'

'ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి'

కోనసీమ: ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని అమలాపురం ఆర్డీవో మాధవి పోలింగ్ సిబ్బందికి సూచించారు. ఆమె అమలాపురంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నందు పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందజేశారు. పోలింగ్ నిర్వహణపై వారికి సూచనలు చేశారు.