గణేశ్ ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి

WNP: గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని గోపాల్ పేట మండల ఎస్సై నరేష్ కుమార్ సూచించారు. రోడ్లను పూర్తిగా మూసివేసి మండపాలు ఏర్పాటు చేయవద్దన్నారు. ఎక్కువ శబ్దం చేసే స్పీకర్లు వాడరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.