నేడు వేణుగోపాలస్వామి ఆలయంలో మహోత్సవాలు

KDP: సింహాద్రిపురంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం నుంచి ఘనంగా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై గోపాలకృష్ణునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకారాలు నిర్వహిస్తారు. వేడుకలకు హాజరై భక్తులకు మధ్యాహ్నం 12 గంటలకు మహానైవేద్యం, అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తారు.