స్టాక్ మార్కెట్ అంటూ.. దోచేస్తున్నారు.!
MDCL: ఉప్పల్‌లో రణవీర్ సింగ్ రూ.43,000 మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో ఫేక్ టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి భారీ లాభాలు వస్తాయని నమ్మించి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించారు. తర్వాత గ్రూప్‌ను క్లోజ్ చేసి మోసగాళ్లు పరారయ్యారు. ఇలాంటి నకిలీ ట్రేడింగ్ సలహాలకు మోసపోవద్దని, అధికారికంగా రిజిస్టర్ అయిన వాటినే నమ్మాలన్నారు.