'జిల్లాను దడ పుట్టిస్తున్న స్క్రబ్ టైఫస్'

'జిల్లాను దడ పుట్టిస్తున్న స్క్రబ్ టైఫస్'

శ్రీకాకుళం జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఏడు కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ వ్యాధి అపరిశుభ్ర పరిసరాల్లోని చిన్న పురుగు కుట్టడం వలన వస్తాయని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం కొత్తూరు, హిరమండలం, గార మండలాల్లో ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. జిల్లా ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండండి.