VIDEO: రహదారిపై వేలాడుతున్న తీగలు.. ప్రమాదభయంలో ప్రజలు
MLG: వాజేడు మండలం చెరుకూరు సమీపంలో బీజాపూర్ WGL జాతీయ రహదారిపై విద్యుత్ తీగలు తెగి వేలాడుతున్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. రోజుకు వందలాది వాహనాలు పోయే ఈ మార్గంలో పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకుండా స్థానికులే రోడ్డుపై రాళ్లు పెట్టి హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే తీగలు తొలగించాలని కోరారు.