మంజీరా నదిలో పడి వ్యక్తి మృతి

మంజీరా నదిలో పడి వ్యక్తి మృతి

KMR: నాగిరెడ్డిపేట మండల పరిధిలోని మంజీరా నదిలో ప్రమాదవశాత్తు పడి ఒకరు మృతి చెందారు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చీనూరు గ్రామానికి చెందిన యేసయ్య శనివారం నదిలో ఉన్న మోటారు పైకి తీయడానికి వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో పడి నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.