గోవుల అక్రమ తరలింపుకి ప్రయత్నం
BDK: చర్ల మండలంలో అక్రమ పశువుల రవాణా ముఠాలు బరితెగిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు పశువులను తరలించేందుకు నేడు భారీగా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, చర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 1,200 గోవులను అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు ఏర్పాట్లు చేసుకున్నారని స్థానికులు తెలిపారు.