గాంధీ వైద్యులను అభినందించిన HRC
TG: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బృందం విధుల్లో భాగంగా ఇవాళ గాంధీ ఆస్పత్రిని సందర్శించింది. ఈ క్రమంలో HRC ఛైర్మన్ డా. జస్టిస్ షమీమ్ అఖ్తర్, కమిషన్ సభ్యులు ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డును పరిశీలించారు. అనంతరం విధుల్లో ఉన్న వైద్యులతో చర్చించారు. పేడియాట్రిక్ సర్జరీ విభాగంలో జరుగుతున్న విశిష్టమైన సేవలను HRC బృందం అభినందించింది.