'ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి'

'ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి'

చిత్తూరు: పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాట్లు చేయాలని హిందూ జాగరణ సమితి సభ్యులు జనసేన పార్టీ ఇంఛార్జ్ చిన్న రాయల్‌కు అర్జీ సమర్పించారు. జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ చిన్నా రాయల్ మాట్లాడుతూ.. హిందూ జాగరణ కమిటీ సభ్యులు తెచ్చిన అర్జీని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.