'నిబంధనలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి'
SRCL: మ్యాచర్ నిబంధన లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని బీజీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్లలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో రైతులు తడిసిన ధాన్యంతో ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలన్నారు.