పొన్నూరులో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

పొన్నూరులో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

GNTR: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. జయభరత్ నగర్‌లో CC రోడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకురాగా, ఆయన స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తక్షణమే రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.