మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ
ELR: మార్చి 14వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 2026 సంవత్సరంలో మొదటి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్ తెలిపారు. ఏలూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత డిసెంబర్‌లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ నందు 11 వేల పైచిలుకు కేసులను రాజీ చేయడం జరిగిందన్నారు.