సర్వేయర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

NLG: ప్రభుత్వం భూ భారతి చట్టం ద్వారా భూ సంబంధిత సేవలను కోరుతున్న ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతోంది. రెవెన్యూ ఉద్యోగులకు తోడ్పాటుగా సర్వే & ల్యాండ్ రికార్డ్స్ శాఖ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. ఈ సర్వేయర్లకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చి నియమించనున్నారు. అర్హులైన వారు మీ సేవ లో ఈ నెల 17 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.