లారీ బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్

మేడ్చల్: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. D. పోచంపల్లి నుంచి మెదక్ వెళ్తుండగా టమాటాల లారీ బోల్తా పడింది. రోడ్డుపై టొమాటోలు చెల్లాచెదురుగా పడటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.