జాతీయ రహదారిపై మహిళ మృతదేహం

MDK: చేగుంటలో 44వ జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. జాతీయ రహదారి పక్కన నిర్మానుష్య ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది.