ఓటమికి నాదే బాధ్యత: CSK కెప్టెన్

ఓటమికి నాదే బాధ్యత: CSK కెప్టెన్

RCB చేతిలో ఓటమికి తానే బాధ్యుడిని అని CSK కెప్టెన్ రుతురాజ్ పేర్కొన్నాడు. తాను బాగా ఆడి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని, బౌలింగ్‌లో 14వ ఓవర్ వరకు తమ చేతిలోనే ఉన్న మ్యాచ్.. తర్వాత చేజారిందన్నాడు. టిమ్ డేవిడ్ క్లీన్ బౌల్డ్ అయిన బంతి నోబాల్ కావడం తమ కొంప ముచ్చిందని.. ఆపై అతను విజృంభించాడని చెప్పాడు. CSK తరఫున సర్ఫరాజ్, ప్రశాంత్, ఓవర్టన్ మంచిగా ఆడారని చెప్పుకొచ్చాడు.