పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
KNR: వర్షాల వల్ల నష్టపోయిన రైతులను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గురువారం గంగాధర మండలం కురిక్యాల, గట్టుభూత్కూర్ గ్రామాల్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "అరుగాలం కష్టపడిన రైతన్న.. ఈ వర్షాల వలన అరిగోస పడుతున్నాడు. అని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశరు.