దివ్యాంగుల సేవా సంస్థలో బాలుడు మిస్సింగ్

NTR: ఇబ్రహీంపట్నం అన్నమ్మ దివ్యాంగుల సేవా సంస్థలో చదువుతున్న ఓ బాలుడు కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం వారు ఆ సంస్థ ముందు నిరసన చేపట్టారు. తమ కుమారుడిని చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ, తమను లోపలికి అనుమతించడం లేదని ఆవేదన చెందారు. తమ బిడ్డను చూపించాలని, లేకపోతే ఆ సంస్థను పూర్తిగా మూసివేయాలని డిమాండ్ చేశారు.