మానుకోట పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన

మానుకోట పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన

MHBD: జిల్లా కేంద్రంలో మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రూ.903 కోట్లతో మంజూరయిన రైల్వే మెగా మెయింటెన్స్ డిపో ఇతర ప్రాంతాలకు తరలించకుండా యథావిధిగా ఇక్కడే నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేసారు. మానుకోట జిల్లాకి వచ్చిన రైల్వే డిపో పరిశ్రమను వేరే ప్రాంతానికి తరలించే కుట్రలు జరుగుతున్నాయని ఆ కుట్రలు మానుకొవాలని హెచ్చరించారు.