ఎరువుల దుకాణంలో డీఎస్పీ తనిఖీలు

ఎరువుల దుకాణంలో డీఎస్పీ తనిఖీలు

KDP: జమ్మలమడుగు పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో మంగళవారం జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు తనిఖీలు చేశారు. ఎరువుల డీలర్ల వద్ద ఉన్న స్టాక్ రిజిస్టర్‌లను పరిశీలించి స్టాక్‌ను సరి చూశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఎరువులను అక్రమంగా నిర్వహించడం, బ్లాక్ మార్కెట్లకు తరలించడం ఒంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.