మైదుకూరులో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం
KDP: మైదుకూరు మండలంలోని గొల్లపల్లి, యాపరాళ్ళపల్లి గ్రామాలలో రబీ 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి బాల గంగాధర్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రైతులు నూతన పద్దతులను అవలంబించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని, పంటలో నీరు నిల్వ ఉంటే 19:19:19, 13:0:45, తెగులు మందులు వాడాలని, రసం పీల్చే పురుగుల నివారణకు జిగురు అట్టలు వాడాలన్నారు.