సీపీఐ సీనియర్ నేత మృతి
BHNG: రాజపేట మండలం బేగంపేట గ్రామంలో సీపీఐ సీనియర్ నాయకులు పాపమ్మల నరసయ్య మృతి చెందాడు. శనివారం సీపీఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పాపం నరసయ్య పార్టీవ దేహానికి ఎర్ర కండువా కప్పి జోహార్లతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుళ్ల లింగం మాట్లాడుతూ.. నరసయ్య లేని లోటు సీపీఐకి తీరని లోటు అన్నారు. పార్టీలో ఉండి ఎన్నో ఉద్యమాలు చేశారని కొనియాడారు.