ధాన్యం కేంద్రాల్లో సరిపడా గన్నీ సంచులు: అ. కలెక్టర్
ఖమ్మం జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేదని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 9,71,500 బ్యాగులు సమకూర్చగా, అవసరమైతే 48 గంటల్లోగా సరఫరా చేస్తామని వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, గన్నీ సంచులతో పాటు టార్ఫాలిన్ కవర్లు కూడా అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు.