ప్రముఖ నిర్మాత ఇంట్లో విషాదం

బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన తల్లి నిర్మల్ కపూర్ చనిపోయింది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మృతి పట్ల పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.